ఖమ్మం మున్నేటి వరదలు తగ్గుముఖం పట్టడంతో బాధితులు వారి ఇళ్లకు చేరుకుని ఇళ్లు, సామన్లను శుభ్రం చేసుకుంటుండగా. పలువురు పరామర్శించడం, కేఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త, బురదను తొలగిస్తుండడంతో ముంపు ప్రాంతాలు జనాలతో కిటకిట లాడుతున్నాయి. అంతేకాక బాధితుల బంధువులు, స్వచ్చంద సంస్థ బాద్యులు, సర్వే బృందాలు, వైద్యసిబ్బంది ఇంటింటికి తిరుగుతుండడంతో పాటు అధికారులు పర్యవేక్షిస్తుండడంతో కాలనీలన్నీ రద్దీగా మారాయి.