ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల కోసం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగుమతి శాఖ సభ్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగుమతి శాఖ అధ్యక్షులు నల్లమల ఆనంద్, కార్యదర్శి చెరుకూరి సంతోష్, శ్రీను, జాయింట్ సెక్రటరీ మన్నెం కృష ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 1, 45, 000 నగదును గురువారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు చిన్ని కృష్ణారావుకు అందజేశారు.