ఇటీవల వరదలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు పలువురు నాయకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షాన విరాళాలు అందజేశారు. ఈ మొత్తం రూ. 2. 25 లక్షలకు చేరాయి. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసి చెక్కును అందజేశారు.