వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం

79చూసినవారు
వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం
ఖమ్మం వరద బాధితుల కోసం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి రూ. కోటి విరాళాన్ని అందించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు చెక్కును అందజేశారు. రూ. కోటితో పాటు లక్షల విలువచేసే మందులను వితరణ చేశారు. వారం రోజుల పాటు ఖమ్మంలోనే సింధు ఆసుపత్రి వైద్యులతో సేవలు అందిస్తారని చెప్పారు. అందుకు ప్రత్యేక వాహనంతో పాటు వైద్యులు, సిబ్బందిని కేటాయించామని ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్