రఘునాథపాలెం మండలం రాంక్యతండాకు చెందిన సీనియర్ నాయకులు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నాయకులు, మైనారిటీ కార్యకర్తలు, ఏఎంసీ సిబ్బంది, తదితరులు సంతాపం ప్రకటించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.