పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రతిష్టాత్మకమైన గ్యాలంట్రీ మెడల్ కు ఎంపికయ్యారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర హోంశాఖ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పోలీస్, ఫైర్, డిఫెన్స్ సర్వీసుల్లో పనిచేసే పలువురు అధికారులకు అవార్డులు ప్రకటించగా జాబితాలో సీపీకి స్థానం దక్కింది. సీపీ గ్యాలంట్రీ మెడల్ కు ఎంపికవడంపై కలెక్టర్, సిబ్బంది అభినందించారు.