ఖమ్మంలో వైభవంగా గిరి ప్రదక్షిణ

68చూసినవారు
ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి(గుట్ట) కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ సోమవారం వైభవంగా కొనసాగింది. స్వామి జన్మ నక్షత్రం (స్వాతి) సందర్భంగా పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ స్వామిని పల్లకీలో ఊరేగిస్తూ పెద్దసంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. ఈసందర్భంగా నృసింహ నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. అనంతరం గుట్టపై ఆలయం పక్కన రాతి కొండపై నక్షత్ర జ్యోతి వెలిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్