రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

51చూసినవారు
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఎన్నికల సమయంలో రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద రూ. 15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి రైతు సత్యాగ్రహం చేపట్టారు.

ట్యాగ్స్ :