కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది: తుమ్మల

69చూసినవారు
కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది: తుమ్మల
జిల్లాలో 200 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నా రెండు లీటర్ల జలాలను కూడా వాడుకునే వీలు ఉండేది కాదని, కానీ సీతారామతో నేడు గోదావరి జలాలు పొలాలకు వస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గోదావరి జలాలను జిల్లాలోని పొలాలకు రప్పించాలనే తన కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఐదు నెలల కాలంలో రూ. 500 కోట్లు ఖర్చు చేసి పంప్ హౌస్లు, రాజీవ్ కెనాల్ అందుబాటులోకి తెచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్