ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలి

66చూసినవారు
ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలి
ఆరోగ్య కార్యక్రమాల అమలులో లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ సోమవారం మండలంలో సమావేశాలు నిర్వహించి శాఖాపరమైన సమస్యలు చర్చించి పరిష్కరించాలన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్యం అందించడమే కాక వ్యాక్సినేషన్ పకడ్బందీగా చేపట్టాలని గురువారం తెలిపారు. అలాగే పలు కార్యక్రమాల నిర్వహణపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్