78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారికి నివాళులు అర్పించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.