చిమ్మపూడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కమిటీ రాజీనామా

0చూసినవారు
చిమ్మపూడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కమిటీ రాజీనామా
చిమ్మపూడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కమిటీ సభ్యులు శనివారం రాజీనామా చేశారు. తమ ప్రమేయం లేకుండా గ్రామంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను ప్రకటించారని, దీనిపై గ్రామస్థులు తమను నిందిస్తున్నారని వాపోయారు. అర్హులైన పేదలు కొందరికి ఇళ్లు రాలేదని, గత పదేళ్లుగా పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తున్నామన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కమిటీ అవసరం లేదని రాజీనామా చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్