ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశరులైన జలగం నగర్ వరద బాధితులకు జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో గురువారం వరద ముంపు బాధిత కుటుంబాలకు ఇండ్ల దగ్గరికి వెళ్లి చాపలు, బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాధిక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు సాటి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.