విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సభకు శాంతియుతంగా వెళుతున్న తమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పీడీఎస్యు, పీవైఎల్ జిల్లా కార్యదర్శులు వెంకటేష్, రాకేష్ అన్నారు. ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ స్కాలర్ షిప్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టైన నాయకులను విడుదల చేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.