గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలను అరికట్టాలని డివైఎఫ్- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 17న ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగే అవగాహన సదస్సును జయప్రదం చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరావు, నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఖమ్మం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో డ్రగ్స్ వ్యతిరేక సదస్సు వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చైతన్యవంతం కావాలని కోరారు.