కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వ హించారు. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం వద్ద ఈనెల 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వేరోస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భీమ్ దీక్ష విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించారు. బుద్ధుడు, అంబేద్కర్ అభిమానులు భారీగా తరలిరావాలని చిప్పలపల్లి శ్రీనివాసరావు, ఆదూరి ప్రసాద్ పిలుపునిచ్చారు.