కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో మార్తా హోమ్ లో మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించారు. వృద్ధులు, వితంతువులు, అనాధలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.