కామేపల్లి: అసెంబ్లీలో బీసీ కుల గణన బిల్లును ప్రవేశపెట్టడం హర్షనీయం

75చూసినవారు
కామేపల్లి: అసెంబ్లీలో బీసీ కుల గణన బిల్లును ప్రవేశపెట్టడం హర్షనీయం
కామేపల్లి మండలం కొత్త లింగాల క్రాస్ రోడ్ లో మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి విగ్రహం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు సంబురాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షు లు చల్ల మల్లయ్య బుధవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కుల గణన బిల్లును అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టడాన్ని స్వాగతిస్తూ సంబురాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్