ఖమ్మం: రూ 1. 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

69చూసినవారు
ఖమ్మం: రూ 1. 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 17, 321 మంది రైతుల నుంచి రూ. 308 కోట్ల విలువైన 1, 33, 325. 160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు  శుక్రవారం అధికారులు తెలిపారు. జిల్లాలో 351 కోనుగోలు కేంద్రాలను తెరవగా ధాన్యం కొనుగోళ్లు మాత్రం 285 కేంద్రాల్లోనే చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యంకు ఇప్పటి వరకు రూ. 246. 09 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని, మిగిలినవి త్వరలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్