పోగొట్టుకున్న13 మొబైల్ ఫోన్లను CEIR ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అదనపు DCP ప్రసాద్ రావు తెలిపారు. శుక్రవారం సీపీ సునీల్ దత్ సూచనల మేరకు ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో బాధితులకు ఫోన్లు అందజేసి మాట్లాడారు. ఖమ్మం కమీషనరేట్ పరిధిలో ఇప్పటికే 4483 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు CEIR పోర్టల్ లో ఫిర్యాదులు నమోదు కాగా 2276 ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు వెల్లడించారు.