ఖమ్మం: 53 మంది బాలలకు విముక్తి

79చూసినవారు
ఖమ్మం: 53 మంది బాలలకు విముక్తి
బాలకార్మికులకు విముక్తి కల్పించేందుకు వివిధ శాఖల భాగస్వామ్యంతో చేపట్టిన ఆపరేషన్ స్మైల్-11 ముగిసిందని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1నుంచి 31 వరకు నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో 53మంది బాలబాలికలకు విముక్తి కల్పించామని చెప్పారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 16మంది ఉన్నారని తెలిపారు. మొత్తం బాలబాలికల్లో 44మందిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్