దేశ వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల పిలుపునిచ్చారు. ఆటో, ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అసంఘటిత, ట్రాన్స్‌ఫోర్ట్ లాంటి రంగాల కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.