ఖమ్మం నగరం 38వ డివిజన్ బ్రాహ్మణ బజార్ శివాలయంలో కార్తీక మాసం 26వ రోజైన గురువారం శనగపిండి, సుగంధ ద్రవ్యాలతో పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ, మహన్యాస పారాయణ చేసి తదనంతరం పూజారులు నమక, చమకాలతో రుద్రాభిషేకం చేశారు. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో, శనగపిండితో రుద్రాభిషేకం చేస్తే సర్వ బాధలు తొలుగుతాయని.. దరిద్ర నాశనం జరుగుతుందని పురోహితులు దుగ్గిరాల సత్యనారాయణశర్మ తెలిపారు.