చోరీ జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉదయ్ కుమార్ కథనం ప్రకారం. కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన రైతు భూక్యా మంగీలాల్ పత్తి అమ్మాక వచ్చిన రూ. 74 వేలను సంచిలో పెట్టుకుని ఖమ్మం పాత బస్టాండ్ లో బస్సు కోసం వేచి ఉండగా, ఖమ్మం వైఎస్ఆర్ కాలనీకి చెందిన అబ్దుల్లా నగదు చోరీ చేశాడు. ఈ మేరకు ఆయనను బుధవారం అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.