ఖమ్మం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్గుబెల్లి నామినేషన్
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, కార్యదర్శి వెంకట్, టీపీటీఎఫ్ అధ్యక్షుడు అనిల్ కుమార్ తో కలిసి నర్సిరెడ్డి నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేశారు.