ఖమ్మం: రెండవ ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలి

75చూసినవారు
ఖమ్మం: రెండవ ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలి
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలను యథావిధిగా రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ డిమాండ్ చేశారు. ఖమ్మం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ. కొంతమందిని రెగ్యులర్ చేయడం హర్షించదగ్గ విషయం అని చెప్పారు. కానీ చాలామందిని విస్మరించడం సరికాదన్నారు. నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్