ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వివిధ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. రాజేశ్వరరావు తెలిపారు. డిప్లొమా ఇన్ అనస్తీషియాలో 30, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ లో 30 సీట్లు ఉన్నాయని, బైపీసీ విద్యార్థులకు తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30లోగా మెడికల్ కాలేజీలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.