ఖమ్మం నగరంలోని నర్తకి థియేటర్ సమీపంలో ఉన్న షాడో ఫ్యాక్స్ టెక్నాలిజీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో దుండగులు షట్టర్ పగలగొట్టి చోరీకి యత్నించారు. కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా షట్టర్ పగలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను పిలిపించి సాక్ష్యాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.