జూన్ 15 నుంచి 30 వరకు PM ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల వికాసానికి, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అమలు చేస్తున్న ఈ పథకం క్రింద జిల్లాలో 35 గిరిజన ఆవాసాలను ఎంపిక చేశామని అన్నారు. అవగాహన సదస్సులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.