ప్రభుత్వ లక్ష్యాల మేరకు రుణమంజూరులో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. గత ఏడాది రైతులకు పంట రుణాలను లక్ష్యానికి మించి 20 శాతం అదనంగా పంపిణీ చేశామని, ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించాలని తెలిపారు. అలాగే, ఎంఎస్ఎంఈ రంగానికి రుణ పంపిణీలో శ్రద్ద చూపాలని తెలిపారు.