ఖమ్మం: శారీరక వైకల్యంతో బాధపడే పిల్లలకు బాసటగా భవిత కేంద్రాలు

58చూసినవారు
ఖమ్మం: శారీరక వైకల్యంతో బాధపడే పిల్లలకు బాసటగా భవిత కేంద్రాలు
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలవాలని ఖమ్మం ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో భవిత కేంద్రాల ఆధునికీకరణ పై ఇంచార్జ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో 8 భవిత కేంద్రాలు ఉన్నట్లు, ఇందులో ప్రత్యేక అవసరాల పిల్లలు విద్యతో పాటు, వారిని సాధారణ పిల్లలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్