ఖమ్మం: సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండ్ల వేడుకలు

59చూసినవారు
ఖమ్మం: సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండ్ల వేడుకలు
ఖమ్మం 26వ డివిజన్ బ్రాహ్మణ బజారు నరసింహస్వామి దేవస్థానం ప్రక్కన గల ది ప్రణవ స్కూల్ ప్రాంగణంలో శనివారం విద్యార్థులకు భోగి పండ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను హరిదాసుల వేషాలు వేయించి, భోగిమంటలు వేసి కొత్తబియ్యంతో పాయసం చేసి వాటి చుట్టూ ఆటపాటలతో కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ సరస్వతీభట్ల భవాని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు భోగిపండ్లు పోసి ఆనందంగా గడిపారు.
Job Suitcase

Jobs near you