ఒకటో పట్టణం బీజేపీ పార్టీ అధ్యక్షతన ప్రధానమంత్రి మోడీ 11 ఏళ్ల ప్రస్థానం సంకల్ప సభ మమతా రోడ్ లోని పసుమర్తి మినీ ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.