జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం ఖిల్లా శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో అదివారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఐహెచ్ ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్ మాట్లాడుతూ మానవ సేవలోనే మాధవ సేవ దాగుందని, ప్రతి ఒక్కరు పరుల సేవ కు పాటుపడాలన్నారు. మనం ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడని అన్నారు. చలికాలం దృష్ట్యా నిరుపేద కుటుంబాలకు ఈ దుప్పట్లు పంచడం జరిగిందన్నారు.