టీజీఎస్ఆర్టీసీ ఖమ్మం డిపో సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. ఖమ్మం డిపోలో డ్రైవర్ పని చేస్తున్న పెంటయ్య మంగళవారం విధులకు హాజరయ్యాడు. అయ్యప్ప మాలధారణలో ఉన్న పెంటయ్యకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించడంతో పెంటయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తీరుపై మండిపడ్డారు.