దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం నిర్మూలనకు, విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించడంలో కేంద్రప్రభుత్వం విఫలం చెందిందని, కేంద్ర బడ్జెట్ ను తిరస్కరించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కోరారు. కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ మంగళవారం ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్ లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ప్రజల సంక్షేమం కంటే కార్పోరేట్ లాభాలకే ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.