బస్ పాస్ చార్జీలపై 20 శాతం పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యాన ఆర్టీసీ పీఓ ఎన్. రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువు కొనసాగిస్తున్నారని చెప్పారు. జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి శివనాయక్, గౌతమ్, హరికృష్ణ, చరణ్, నాగరాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.