విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇటీవల జరుగుతున్న కలుషిత ఆహారం ఘటనలకు వ్యతిరేకంగా శనివారం పాఠశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, ప్రవీణ్, వెంకటేష్, క్రాంతి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బంద్ ను జయప్రదం చేయాలన్నారు.