అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ తండ్రి చిత్తారు హుస్సేన్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.