ఖమ్మం: పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి

84చూసినవారు
ఖమ్మం: పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి
పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. సతుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల అధికారులతో సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో సమావేశమైన ఆమె ఆస్తి పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల్లో పురోగతి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రాధాన్యత ఇస్తూనే ఆస్తి పన్నులు వంద శాతం వసూలు చేయాలని తెలిపారు. స్థానిక కమిషనర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్