
సీబీఐ అధికారి పేరిట మోసం.. రూ.1.34 కోట్లు స్వాహా
CBI అధికారి పేరిట సైబర్ నేరగాళ్లు ఓ విశ్రాంత శాస్త్రవేత్తను టార్గెట్ చేసి రూ.1.34 కోట్లు స్వాహా చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో నిన్ను అనుమానిస్తున్నారు అంటూ బెదిరించి, నకిలీ CBI గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్లు చూపించారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, CBI ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. దర్యాప్తు తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామంటూ డబ్బు కాజేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.