ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలించాక ఆయన భద్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు సీహెచ్. స్వామి, డీటీ అన్సారీ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.