ఖమ్మం: సఖి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

72చూసినవారు
ఖమ్మం: సఖి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న సఖి కేంద్రాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం పరిశీలించారు. ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేక అధికారి రోజారాణి వివరించగా, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరిస్తానని తెలిపారు. సెక్యూర్ సంస్థ ప్రతినిధి ఏ. వెంకటకృష్ణ, అడ్మిన్ కె. సరిత, కౌన్సిలర్లు పి. శ్రీదేవి, అంజని, స్వరూప, అరుణ, పుష్పలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్