
ATMలో నింపాల్సిన రూ.40.50 లక్షలతో పారిపోయిన ఉద్యోగి
TG: నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్టలో సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి రమాకాంత్ రూ.40.50 లక్షల నగదుతో పరారైన ఘటన కలకలం రేపింది. బ్యాంకు ATMలలో నగదు లోడ్ చేయాల్సిన సమయంలో వాహనం ఆలస్యమవడంతో, ఆ మొత్తాన్ని తీసుకుని రమాకాంత్ పారిపోయాడు. గత ఐదేళ్లుగా ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న అతను, నగదు తీసుకెళ్లే బాధ్యతలో ఉన్నాడు. సంఘటనను గుర్తించిన ఏజెన్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.