15వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయినుల ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలే దంపతులకు చెందుతుందని, సమాజంలో వారు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.