బలమైన ఆహారంతోనే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. శనివారం కామన్ డైట్ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం అల్లీపురం రోడ్డులో తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు, కూరగాయలు, సరుకులను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలు, విద్యా బోధన గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.