నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలని, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నూతన సంవత్సరం సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి కేకును కట్ చేశారు. జిల్లా ప్రగతిలో సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలన్నారు.