ఖమ్మం నగరం గురువారం మంచుపూల దుప్నటి కప్పుకుంది. తెల్లవారుజామునుంచే మంచువర్షం కురుస్తున్నట్లుగా చిరు చినుకులతో ప్రకృతి తన అందాల హొయలను చూపించింది. ప్రకృతి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని తన అందాల సుమగంధాలను అందించింది. నాలో ఇంత కళానైపుణ్యం ఉన్నదంటూ తెరలు, తెరలుగా మంచుకురుస్తూ అందరి చూపులనూ ఆకర్షించింది.