కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో ఇటీవల కళాశాలల యజమాన్యాలు బంద్ పాటించిన విషయం విదితమే. ఆతర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్చిండంతో కళాశాలలను తెరవగా 26నుంచే జరగాల్సిన డిగ్రీ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. దీంతో శుక్రవారం నుంచి పరీక్షలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు.