ఖమ్మం: గ్యారంటీ హక్కు చట్టం చేయాలని ధర్నా

53చూసినవారు
ఖమ్మం: గ్యారంటీ హక్కు చట్టం చేయాలని ధర్నా
కనీస మద్దతు ధరలకు గ్యారంటీ హక్కు చట్టం చేయాలని ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య డిమాండ్ చేశారు. జనవరి 9న డిమాండ్ డేగా ఏఐయూకేఎస్ జాతీయస్థాయి పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యాన గురువారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిరాహార దీక్ష చేస్తున్న రైతు జగ్జీత్ సింగ్ దల్లేవాలకు ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్